తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు బీభత్సం... మద్యం మత్తులో డ్రైవర్! - హయత్​నగర్ సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు భీభత్సం

ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హయత్​నగర్ సమీపంలోని భాగ్యలతలో డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ప్రజలు భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

హయత్​నగర్ సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు భీభత్సం

By

Published : Oct 13, 2019, 8:42 PM IST

Updated : Oct 13, 2019, 9:18 PM IST

హయత్​నగర్ సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు భీభత్సం

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని భాగ్యలత సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం సృష్టించింది. హకీంపేట డిపోకు చెందిన టీఎస్ 08 యూబీ 5496 నెంబరు గల అద్దె బస్సు భాగ్యలత వద్ద డివైడర్ మీదకు దూసుకెళ్లింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. డివైడర్​పై విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి... తర్వాతఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకోట్టింది. వాహనదారుడి తలకు గాయాలయ్యాయి. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది.

Last Updated : Oct 13, 2019, 9:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details