సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ అదనపు కౌంటర్ దాఖలు చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రజా సర్వీసుల్లోని వారు సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని పేర్కొంది. డిమాండ్ల పరిష్కారానికి కార్మిక శాఖ మధ్యవర్తిత్వం చేపట్టిందని ఆర్టీసీ స్పష్టం చేసింది.
సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ అదనపు కౌంటర్ - Rtc file the counter in highcourt
16:11 November 16
సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ అదనపు కౌంటర్
చర్చలు నడుస్తుండగానే యూనియన్ నాయకులు సమ్మెకు దిగారని వివరించింది. బెదిరించే ధోరణితోనే దసరా సమయంలో సమ్మెకు వెళ్లారని ఆర్టీసీ వెల్లడించింది. సమ్మె హక్కు కూడా చట్టానికి అనుగుణంగానే ఉండాలని తెలిపింది.
ప్రభుత్వంలో విలీనమనే అసాధ్యమైన ఆలోచనతోనే కార్మికులు ముందుకు వచ్చారని స్పష్టం చేసింది. కార్మికుల డిమాండ్ అంగీకరిస్తే మిగతా 50 కార్పొరేషన్లు కూడా విలీనానికి ఒత్తిడి తెస్తాయని ఆర్టీసీ పేర్కొంది.
ఇవీ చూడండి : బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ