కార్మిక సంఘాలు ఒక మెట్టు దిగినా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ లింగమూర్తి ఆరోపించారు. సమ్మెలో భాగంగా ముషీరాబాద్‌లో ఆయన సీఐటీయూ నాయకులతో కలిసి దీక్షకు దిగారు. ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు.
'ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం'
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మూషీరాబాద్‌లో కార్మికులు దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.
'ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం'
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు రాకపోవడం సమంజసం కాదని లింగమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'తక్షణమే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి'