విధుల్లో చేరేందుకు సిద్ధమని హైదరాబాద్ పాతబస్తీ ఫారూఖ్ నగర్, ఫలక్‌నుమా డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. 52 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా రాసుకొచ్చిన పేపర్లను అందించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మేనేజర్ పేర్కొన్నారు.
మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి: ఆర్టీసీ కార్మికులు - RTC employs Request to Farukhnagar DM to join into jobs
విధుల్లో చేరుతామంటూ హైదరాబాద్ ఫారూఖ్ నగర్, ఫలక్‌నుమా డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులు మేనేజర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమ్మె కారణంగా చాలా నష్టపోయామని పలువురు కార్మికులు వాపోయారు.
మమ్ముల్ని విధుల్లోకి తీసుకోండి: ఆర్టీసీ కార్మికులు