ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. రోడ్డు రవాణా సంస్థపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈనెల 19న సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్ విద్యానగర్లోని యానియన్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈనెల 19న ఆర్టీసీ కార్మికుల చలో అసెంబ్లీ
ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 19న సామూహిక నిరాహార దీక్ష, చలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి తెలిపారు.
ఈనెల 19న ఆర్టీసీ కార్మికుల చలో అసెంబ్లీ
వేతన సవరణచేయాలని, ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కొండగట్టు వెళ్లే బస్లో 125మంది... సీజ్