కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించకపోవడం సమంజసం కాదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధనాలపై రాజీలేని పోరాటం చేసేందుకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రయాణికులు లేక నష్టపోతున్నారని, అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడం సమంజసం కాదని ఆయన ఆరోపించారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి : ఆర్టీసీ ఈయూ - హైదరాబాద్ వార్తలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో ప్రజా రవాణా వ్యవస్థకు ఒక రూపాయి కేటాయించక పోవడం విచారకరమని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి : ఆర్టీసీ ఈయూ
ఆర్టీసీ బస్సులలో భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కార్మికులు విధులు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కరోనా వైరస్ బారినపడ్డ వారికి యాభై లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈపీఎఫ్ విత్ డ్రా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!