ఆర్టీసీ కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆరోపించారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. 2019లో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై 55 రోజుల సమ్మె చేపట్టిన నేపథ్యంలో... ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండకూడదనే ఉద్దేశంతో యూనియన్లను మౌఖికంగా రద్దు చేస్తున్నట్లు ఆదేశించారని కమిషన్కు యూనియన్ నాయకుడు రాజిరెడ్డి వివరించారు.
కమిటీలు విఫలం
యూనియన్ల స్థానంలో వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేశారని... అవి యాజమాన్యానికి కార్మికుల మధ్య వారధిగా పనిచేస్తాయని ప్రభుత్వం తమని మభ్యపెట్టిందని ఆరోపించారు. ఆ కమిటీలు చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను యాజమాన్యానికి తెలపడంలో విఫలం అవుతున్నాయని పేర్కొన్నారు.