Rtc Driver Died: రోజువారి విధుల్లో భాగంగా బస్సును ప్లాట్ ఫారంపై పెట్టిన కొద్దిసేపటికే ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడప ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. కడపకు చెందిన రాజగోపాల్ కడప ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం ఆయన విధుల నిమిత్తం గ్యారేజ్‌కి వచ్చాడు. బస్సును తీసుకొని ఫ్లాట్ ఫారం వద్దకు వెళ్లాడు. ప్లాట్ ఫారంపై బస్సును పార్కింగ్ చేసిన కొద్దిసేపటికి రాజగోపాల్‌కు గుండెపోటు రావడంతో వెంటనే స్థానికులు ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. బస్సు వెళ్తున్న సమయంలో గుండెపోటు వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగేదని, ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించాలని, చెడు అలవాట్లకు బానిసలు కావద్దని అధికారులు సూచించారు.
గుండెపోటుతో ఆర్టీసీ బస్ డ్రైవర్ మృతి - kadapa district latest news
Rtc Driver Died: కడప ఆర్టీసీ డిపోలో విషాదం చోటు చేసుకుంది. రోజువారి విధుల్లో భాగంగా, ఆర్టీసీ బస్సును ప్లాట్ ఫాంలో నిలిపాడు. కొద్దిసేపటికే డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో తోటీ సహచరులు హుటాహుటీన డ్రైవర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి రాకముందే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు.
rtc