సికింద్రాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపో1లో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాణిగంజ్‌లో విధులు నిర్వహిస్తున్న తిరుపతి రెడ్డికి అధికారులు కొన్ని రోజులుగా విధులు కేటాయించట్లేదు. ఈ విషయమై బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అధికారులు వేధిస్తున్నారంటూ... తిరుపతిరెడ్డి డిపోలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విధుల్లోకి తీసుకోవట్లేదని పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..! - తెలంగాణ వార్తలు
సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో-1లో డ్రైవర్ తిరుపతిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి రెడ్డికి అధికారులు కొన్ని రోజులుగా విధులు కేటాయించట్లేదు. ఈ విషయమై బాధితుడు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

rtc driver suicide
అప్రమత్తమైన సహచరులు ఆస్పత్రికి తరలిస్తుండగానే దారిలో తిరుపతి రెడ్డి మృతి చెందాడు. నెలరోజుల నుంచి అధికారులు డ్యూటీ ఇవ్వకుండా వేధిస్తున్నారని సహోద్యోగులు ఆరోపించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ఆర్టీసీ డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. రాణిగంజ్ డిపో నుంచి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.
విధుల్లోకి తీకుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
ఇదీ చూడండి:అటవీ భూముల రగడ.. పోలీసుల రంగప్రవేశం!