హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ ఐకాస అఖిలపక్షం సమావేశం కొనసాగుతోంది. అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఐకాస నేతలు ఆహ్వానించారు. ఆర్టీసీ సమ్మె జీతభత్యాల సమస్య గురించి కాదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం గవర్నర్ తమిళిసైను కలిసి వినతిపత్రాన్ని అందజేస్తామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అన్ని రాజకీయపార్టీలు తమకు సహకరించాలని ఆయన కోరారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామన్నారు.
శుక్రవారం గవర్నర్‌ను కలుస్తాంః అశ్వత్థామరెడ్డి - ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి ఎల్లుండి గవర్నర్ తమిళిసైను కలిసి వినతిపత్రాన్ని అందజేయనున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరుగుతున్న ఆర్టీసీ ఐకాస అఖిలపక్షం సమావేశంలో స్పష్టం చేశారు.
శుక్రవారం గవర్నర్‌ను కలుస్తాంః అశ్వత్థామరెడ్డి