ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. గతేడాది కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో ఆర్టీసీ బస్సులు నెలల తరబడి డిపోలకే పరిమితమయ్యాయి. తిరిగి ప్రజా రవాణా రోడ్డెక్కినా... నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీఎస్ఆర్టీసీలో మొత్తం 9,666 బస్సులు ఉన్నాయి. వీటిలో 6,520 సొంత బస్సులు, 3,246 అద్దె బస్సులు ఉన్నాయి.
మూడేళ్లలో వరసగా రూ.928 కోట్లు, రూ.వెయ్యికోట్లు, రూ.1,786 కోట్లు నష్టాలు వచ్చాయి. ఈ విధంగా చూస్తే ప్రతి సంవత్సరం నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి తప్పా... తగ్గడంలేదని ఆర్టీసీ గణాంకాలే చెబుతున్నాయి. అధికారులు, కార్మికుల సమిష్టి కృషితోనే నష్టాల నుంచి విముక్తి లభిస్తుందని యాజమాన్యం భావిస్తుంది.