ఆర్టీసీ కార్మికుల ఆత్మబలిదానాలు ఆగడంలేదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా హైదరాబాద్ కార్వాన్లో ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉరి వేసుకుని
కార్వాన్ ప్రాంతంలో నివసించే సురేందర్ గౌడ్, రాణిగంజ్ డిపోలో గత 15 ఏళ్లుగా కండక్టరుగా పనిచేస్తున్నాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పపత్రికి తరలించగా అప్పటికే సురేందర్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఉద్యోగం పోయిందన్న మనస్తాపంతో సురేందర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.