తెలంగాణ

telangana

ETV Bharat / state

Tsrtc charges: సెస్సు పెంపు అమలులోకి.. భారీగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

Tsrtc: తెలంగాణ ఆర్టీసీ డీజిల్‌ సెస్సు పేరుతో మరోదఫా ప్రయాణికులపై భారీ భారాన్ని మోపింది. కిలోమీటరు ప్రాతిపదికన పల్లెవెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు అన్నింటిపైనా ఛార్జీలను పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రయాణికులను మాత్రం ఈ పెంపు నుంచి మినహాయించింది. తాజాగా పెంచిన డీజిల్‌ సెస్సు అమలులోకి వచ్చింది. దీనితో ఛార్జీలపై భారీగానే ప్రభావం పడింది.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

By

Published : Jun 10, 2022, 9:35 AM IST

Tsrtc: టీఎస్​ఆర్టీసీ తాజాగా పెంచిన డీజిల్‌ సెస్సు అమలులోకి వచ్చింది. కిలోమీటర్ల వారీగా సెస్సును పెంచటంతో ఛార్జీలపై భారీగానే ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు ఆయా మార్గాల్లో పాత ఛార్జీలే అమలులో ఉంటాయి. ఆ రెండు రాష్ట్రాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఛార్జీలు ఒకేలా ఉండాలి. తాజా సెస్సు పెంపుదల ఉత్తర్వులను ఆయా రాష్ట్రాలకు పంపించినట్లు టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆయా రాష్ట్రాలు సోమ, మంగళవారాల్లో తెలంగాణతో సమానంగా ఛార్జీలను సవరించనున్నాయన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటే అంతవరకు పెరిగిన సెస్సును వసూలు చేస్తున్నారు. గడిచిన మార్చిలో వివిధ రూపాల్లో ఛార్జీలు పెంచారు. వాటితో పాటు తాజా సెస్సు పెంపుదలతో కలిపి రోజువారీ ఆదాయం రూ.70 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు అధికంగా వస్తుందని అధికారుల అంచనా. సాధారణంగా సోమవారం నాడు ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

సోమవారాల్లో రూ.కోటి వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన రోజుల్లో వచ్చే ఆదాయం 15-20 శాతం తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రోజుకు సగటున రూ.13 కోట్ల నుంచి రూ.14 కోట్ల ఆదాయం పొందగలిగితే వార్షిక నష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని ఉన్నతాధికారి వివరించారు. సెస్సుల పెంపుదలతో వచ్చే ఆదాయంలో సింహభాగం పెరిగిన డీజిల్‌ ధరలకే సరిపోతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:TSRTC Charges: మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుంచే అమలు

రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో పలువురు గవర్నర్లు.. తమిళిసై కూడా!

ABOUT THE AUTHOR

...view details