తెలంగాణ

telangana

ETV Bharat / state

రద్దీ ఆధారంగా ఛార్జీల ధరలు.. త్వరలో తీసుకొస్తున్న ఆర్టీసీ - Telangana State Road Transport Corporation

Dynamic pricing implement in TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఆన్​లైన్​ టికెట్​ బుకింగ్​కు డైనమిక్​ ప్రైసింగ్​ విధానం అమలు చేస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్​ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగుళూరు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.

Tsrtc
Tsrtc

By

Published : Mar 23, 2023, 8:59 PM IST

Dynamic pricing implement in TSRTC: టీఎస్‌ఆర్టీసీని మరింత లాభాలబాటలో తీసుకొచ్చే ప్రయత్నాలను సంస్థ యాజమాన్యం మమ్మురం చేసింది. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో "డైనిమిక్‌ ప్రైసింగ్" విధానం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రోడ్డు రవాణా రంగంలో ప్రవేశపెట్టనున్నారు.

ప్రయాణికుల సౌకర్యర్థం పైలెట్ ప్రాజెక్టుగా బెంగళూరు మార్గంలో నడిచే గరుడ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 27వ తేదీ నుంచి హైదరాబాద్‌ సహా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల నుంచి బెంగళూరు వెళ్లే బస్సు సర్వీసుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రారంభించనున్నారు.

విమానాలు, రైళ్లు, హోటళ్లు, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల బుకింగ్‌ విధానం ఇప్పటికే అమల్లో ఉన్న ఈ డైనమిక్ ప్రైసింగ్‌.. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్ సదుపాయం సర్వీసులన్నింటిలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం విస్తృతంగా కసరత్తు చేస్తోంది.

డైనమిక్ ప్రైసింగ్‌ అంటే...

కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక డేటా విశ్లేషణ ఆధారంగా మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలు నిర్ణయించబడతాయి. ప్రయాణికులకు నష్టం లేకుండా ఛార్జీలు సరసంగా ఉంటాయి. సోమ, మంగళ, బుధవారాల్లో రద్దీ తక్కువగా ఉంటే సాధారణ ఛార్జీ కంటే తక్కువగా టికెట్ ధర ఉంటుంది. అదే పండుగలు లేదా వారాంతపు సెలవు దినాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు ఛార్జీలు ఉంటాయి. డిమాండ్ ఉంటే 125 శాతం, డిమాండ్ లేకపోతే 75 శాతం ఛార్జీలపై ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముందు సీట్లు, కిటికీల పక్కన సీట్లు కావాలంటే ఎక్కువ రేట్లు ఉంటాయి. ఈ విధంగా టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులు జరగడమే ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం.

ఈ విధానం కింద టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తుంది. మారుతున్న ప్రయాణికుల అభిరులు, అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో కార్గో సేవలు, డిజిటల్ సేవలు, కొత్త ఎలక్ట్రికల్ బస్సు సేవలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో కార్గో సేవలపై కొన్ని విమర్శలు రావడంతో పునఃసమీక్షించిన యాజమాన్యం.. బృందాలను మారుస్తోంది. వరంగల్ కళాశాలలో సిబ్బంది హుందాతనంగా ఎలా ప్రవర్తించాలో శిక్షణ ఇస్తోంది. ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేయబోతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.

టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.in లో ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని దేశంలో మొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ఈ "డైనమిక్ ప్రైసింగ్" విధానంలో వికలాంగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయుల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆర్టీసీ స్పష్టత ఇచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details