లాక్డౌన్ విరామ సమయం పెరగడంతో ఆర్టీసీ బస్సులను తిప్పే సమయాన్ని పెంచామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి పేర్కొన్నారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2గంటల వరకు తిప్పుతున్నామని... వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
RTC: రేపటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ సేవలు - telangana varthalu
రేపటి నుంచి రాష్ట్రంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. లాక్డౌన్ విరామ సమయం పెరగడంతో బస్సులను తిప్పే సమయాన్ని పెంచామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ తెలిపారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరగనున్న ఆర్టీసీ బస్సులు
ప్రభుత్వం ఈనెల 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటిరోజు 5 గంటల వరకు విధించింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ విరామ సమయంలో సిటీ బస్సులను తిప్పుతామని ఈడీ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లు అన్నీ.. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని ఈడీ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: Metro services: హైదరాబాద్ మెట్రో సేవల సమయం పొడిగింపు