RTC Bus Accident At Nellore District: రోడ్డుపై గుంతను తప్పించబోయి..బస్సు బ్రేక్ రాడ్ విరగటంతో..చెట్టును ఢీ కొన్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 40మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నెల్లూరు నుంచి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు గుంతను తప్పించబోయి.. మరో గుంతలో పడి బ్రేక్ రాడ్ విరిగిపోవడంతో చెట్టును ఢీకొంది. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థలానికి సురక్షితంగా చేర్చారు.
బస్సు బ్రేక్ రాడ్ విరిగింది.. బస్సెళ్లి చెట్టును ఢీకొట్టింది.. - చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
RTC Bus Accident At Nellore District: ప్రయాణికులను వారి గమ్యస్థలాలకు క్షేమంగా చేర్చే ఆర్టీసీ వ్యవస్థ ఉన్నప్పటికీ..అయితే ప్రయాణ మార్గంలో ఒడిదుడుకులు ఉంటే.. ఆ వ్యవస్థ మాత్రం ఏమీ చేయగలదు.. అప్పుడప్పుడు ప్రమాదాలకు గురికాక తప్పదు.. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
![బస్సు బ్రేక్ రాడ్ విరిగింది.. బస్సెళ్లి చెట్టును ఢీకొట్టింది.. RTC Bus Accident At Nellore District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17201576-291-17201576-1671001495950.jpg)
గుంతలు తప్పించబోయి చెట్టును ఢీకొన్న బస్సు
గుంతలు తప్పించబోయి చెట్టును ఢీకొన్న బస్సు