తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు: అశ్వత్థామరెడ్డి - భవిష్యత్ కార్యచరణను ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు

హైదరాబాద్​లో ఆర్టీసీ జేఏసీ , విపక్ష నేతలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా ఇవాళ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు: అశ్వత్థామరెడ్డి

By

Published : Nov 11, 2019, 5:08 AM IST

Updated : Nov 11, 2019, 7:54 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఇవాళ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్​లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ , విపక్ష నేతలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణను ఐకాస నేతలు ప్రకటించారు.

మంగళవారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్​తో పాటు మరో ముగ్గురు కో కన్వీనర్లతో కలిసి ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో ప్రాణత్యాగం చేసిన కార్మికులతో పాటు ఛలో ట్యాంక్​బండ్ సందర్భంగా గాయపడిన కార్మికుల ఫోటోలను ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. దిల్లీలో మానవ హక్కుల సంఘానికి, మహిళా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా సడక్​ బంద్​ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు: అశ్వత్థామరెడ్డి

ఇదీ చదవండిః ఆర్టీసీ సమ్మె: 12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష

Last Updated : Nov 11, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details