కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రవాణా శాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. వివిధ పనుల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వాహనదారులకు కరోనాపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనుంది. ఇందుకోసం అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కార్యాలయాల్లో బ్యానర్లను, పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. జన సమూహం ఉండే ప్రాంతంతో పాటు ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
పకడ్బందీ చర్యలు...
బోర్డర్ చెక్ పోస్టుల్లోనూ తగిన చర్యలు చేపట్టారు. అత్యవసర సేవలతో పాటు మార్చి నెలాఖరు గడువు ముగిసే లెర్నర్ లైసెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యూవల్స్, రిజిస్ట్రేషన్ సేవలు యాథావిధిగా కొనసాగనున్నట్లు కమిషనర్ ఎంఆర్ఎం రావు స్పష్టం చేశారు. 54 ఆర్టీఏ యూనిట్ కార్యాలయాలు, 15 చెక్ పోస్టుల దగ్గర తప్పనిసరిగా శానిటైజర్ ఏర్పాటు చేశారు. లైసెన్స్‌ల జారీ ప్రక్రియ సమయంలో అభ్యర్థులు తగిన దూరంలో ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి : తెలంగాణలో మరో కరోనా కేసు: మంత్రి ఈటల