తెలంగాణ

telangana

ETV Bharat / state

రవాణా శాఖ కమిషనర్​ ఎంఆర్​ఎం.రావుకు పురస్కారం - transport department

ఇండియన్ ఎక్స్​ప్రెస్ నిర్వహించిన డిజిటల్ సభలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్​ ఎంఆర్​ఎం.రావుకు పురస్కారం లభించింది. ఆర్టీఏ చాట్ బాట్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సేవలకు గానూ... రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్​కు పురస్కారం అందించారు.

rta got award from indian express
rta got award from indian express

By

Published : Aug 27, 2020, 11:41 AM IST

ఆర్టీఏ చాట్ బాట్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సేవలకు గానూ... రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్​ ఎంఆర్​ఎం.రావుకు పురస్కారం లభించింది. ఇండియన్ ఎక్స్​ప్రెస్ నిర్వహించిన డిజిటల్ సభలో పురస్కారం అందించారు. రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతో రూపొందించిన ఆర్టీఏ చాట్ బాట్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలు, ప్రశ్నలను సంధిస్తే వాటికి సత్వరమే సమాధానం ఇచ్చే విధంగా సేవల్ని అందిస్తున్నామని కమిషనర్ ఎంఆర్ఎం.రావు పేర్కొన్నారు.

పౌర సేవల్ని మరింత మెరుగు పరిచే దిశలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని కమిషనర్​ వెల్లడించారు. వినియోగదారుల డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు, వాహనాల సేవలకు సంబంధించిన ప్రశ్నలు అడిగిన వెంటనే సమాధానాలు ఇవ్వడం ఆర్టీఏ చాట్ బాట్ ప్రత్యేకత అని వివరించారు. వినియోగదారుల ప్రశ్నలు ప్రత్యేకమైన ఐడీతో డేటా బేస్​లో నిల్వ చేయడం జరుగుతోందన్నారు. పారదర్శకంగా సేవల్ని అందించేందుకు తగిన కృషి చేస్తున్నామన్నారు. సర్వర్ షిప్టింగ్ సాంకేతిక కారణాల వల్ల చాట్ బాట్ సేవల్ని మెరుగైన రీతిలో కొద్ది కాలంలోనే పునరుద్ధరించడం జరుగుతుందని రవాణాశాఖ కమిషనర్ తెలిపారు.

ఇదీ చూడండి:'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details