తెలంగాణ

telangana

నటుడు రాజశేఖర్​ కారుపై 21 చలాన్లు.. లైసెన్సు రద్దు..

By

Published : Dec 18, 2019, 4:22 PM IST

నటుడు రాజశేఖర్​ రెండేళ్లుగా డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా వాహనం నడుపుతున్నారు. ఇటీవల ఔటర్​ రింగు రోడ్డుపై రాజశేఖర్​ కారు ప్రమాదానికి గురైన ఘటనతో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం బయటపడింది. ఆ వాహనంపై మొత్తం 21 ట్రాఫిక్​ ఉల్లంఘనల కేసులు ఉన్నాయని అధికారులు నిర్ధరించారు.

లైసెన్సు రద్దు
నటుడు రాజశేఖర్​ కారుపై 21 చలాన్లు

నటుడు రాజశేఖర్​ కారుపై 21 చలాన్లు.. లైసెన్సు రద్దు..
సినీ నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నట్టు అధికారులు నిర్ధరించారు. ఇటీవల హైదరాబాద్​ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ ఆర్టీఏ ఆయన లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే అసలు ఆయనకు లైసెన్సే లేదని తేలడం పెద్ద మలుపుగా మారింది.

జూన్ 18, 2012న రాజశేఖర్ తన లైసెన్స్ రెన్యువల్ చేయించుకోగా.. దాని వాలిడిటీ జూన్ 17, 2017తో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఆయన రెన్యువల్‌కి దరఖాస్తు చేసుకోలేదు. ఇదే క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో టోలీచౌకీ ఆర్టీఏ అధికారులు నవంబర్ 29,2019 నుంచి మే 28, 2020 వరకు రాజశేఖర్ లైసెన్స్ రద్దు చేశారు.

ఈ నేపథ్యంలో అధికారులు ఆయన డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నాడని తేలడం వల్ల మోటారు వాహనాల చట్టం 181 సెక్షన్‌ కింద ఆయనపై కేసు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ప్రమాదానికి గురైన రాజశేఖర్ కారుపై మొత్తం 21 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు ఉన్నాయన్నారు. వీటిల్లో 19 కేసులు అతివేగానికి సంబంధించినవే అని తెలిపారు. అయితే వచ్చే ఏడాది మే 28 వరకు ఆయన లైసెన్స్‌ను ఆర్టీఏ రద్దు చేయడం వల్ల అప్పటివరకు ఆయన డ్రైవింగ్‌కి దూరంగా ఉండాల్సిందేనని పోలీసులు పేర్కొన్నారు. లేనిపక్షంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చూడండి:నటుడు రాజశేఖర్‌కు తప్పిన ప్రమాదం

TAGGED:

ABOUT THE AUTHOR

...view details