RS PraveenKumar Fires on Telangana Government : రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోందని.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీసు అధికారులను నమ్ముకొని పాలన నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరవీరుల స్థూపం వద్ద శాంతియుతంగా నిరసన చేస్తామంటే.. తనను గృహ నిర్భందం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు గృహ నిర్భందం చేశారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
RS PraveenKumar Comments on KCR : తనను గృహ నిర్భందం చేసినట్లుగానే.. ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS PraveenKumar)విమర్శించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. పేపర్ లీకేజీ కారకులతోనే.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క నెలలోనే.. 10 పరీక్షలు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. బీఎస్పీని (BSP) అణచివేయాలని.. పోలీసులకు ముఖ్యమంత్రి సూచనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే నియంతలు ఎక్కువ కాలం పాలన చేయలేరని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
Group-2 Candidates Protest Hyderabad : గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల పోరుబాట
"తనను గృహ నిర్భందం చేసినట్లుగానే.. ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేస్తారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు. పేపర్ లీకేజీ కారకులతోనే.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్క నెలలోనే 10 పరీక్షలు ఎలా పెడతారు?. బీఎస్పీని అణిచివేయాలని.. పోలీసులకు ముఖ్యమంత్రి సూచనలు చేస్తున్నారు. నియంతలు ఎక్కువ కాలం పాలన చేయలేరు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తాం." - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు