తెలంగాణ

telangana

ETV Bharat / state

RSP on Karnataka results : 'RSS​, BJP విద్వేషపూరిత రాజకీయాల చేతిలోకి పోకుండా వారు కాపాడుకున్నారు' - Praveen Kumar respond Karnataka election results

RS Praveen Kumar on Karnataka Results : కర్ణాటకలో ఆర్ఎస్​ఎస్​, బీజేపీ విద్వేషపూరిత రాజకీయాల చేతిలోకి పోకుండా అక్కడి ప్రజలు జాగ్రత్త పడ్డారని ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల కేసీఆర్ సర్కార్ నిరంకుశంగా వ్యవహారిస్తుందని ఆయన మండిపడ్డారు.

RS Praveen Kumar
RS Praveen Kumar

By

Published : May 13, 2023, 7:32 PM IST

RS Praveen Kumar on Karnataka Results : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ స్పందించారు. ఆర్ఎస్​ఎస్​, బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలు, విచ్చలవిడి అవినీతి.. చేతిలోకి పోకుండా అక్కడి ప్రజలు కాపాడుకున్నారని అన్నారు. తిరిగి భారతదేశాన్ని రాతియుగంలోకి వెళ్లకుండా చేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్, కమలం.. నిరంకుశ రహస్య కూటమిని గద్దె దించి ఇక్కడి ప్రజలు బహుజన రాజ్యాన్ని నిర్మించబోతున్నారని ఆయన​ ఆశాభావం వ్యక్తం చేశారు.

జేపీఎస్​లపై సర్కార్ వ్యవహరించే విధానం రాజ్యాంగ విరుద్ధం : ఈ క్రమంలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తుందని ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా వారితో పని చేయించుకొని ఇపుడు వారి బలవన్మరణానికి కారణం అవుతున్నారని విమర్శించారు. జేపీఎస్​లపై సర్కార్ వ్యవహరించే విధానం రాజ్యాంగ విరుద్ధమైనదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటూ.. మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలని.. అందుకు సహాయనిరాకరణ ఉద్యమం చేపట్టాలని రాష్ట్ర ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.

ప్రభుత్వ నిరంకుశ విధానం వల్ల బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయిన సోనికి నివాళిగా.. ప్రతి గ్రామపంచాయితీ నుంచి ఆ గ్రామంలోని మహానీయుల విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ కోరారు. పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ మిత్రులు కూడా తమ ఆఫీసుల్లో తోటి ఉద్యోగిని సోనికి నివాళి అర్పించి వారి కుటుంబానికి అండగా నిలవాలని ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ అన్నారు.

ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరం : ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరం అనే నినాదంతో ముందుకు సాగాలని ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ అన్నారు. ఓవైపు జేపీఎస్​లు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. మరోవైపు ఈ ప్రభుత్వం నేడు ఉద్యోగాల్లో చేరకుంటే.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకుంటామని అనడం దుర్మార్గమైన చర్యగా ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ అభివర్ణించారు.

"జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తోంది. నాలుగేళ్లుగా వారితో పని చేయించుకొని ఇప్పుడు వారి బలవన్మరణానికి కారణం అవుతున్నారు.. జేపీఎస్​లపై ప్రభుత్వం వ్యవహరించే విధానం రాజ్యాంగ విరుద్ధమైనది. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటూ.. మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలి." - ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి :Junior Panchayat Secretary Suicide : జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య.. కారణం అదే..!

Revanth Reddy on Karnataka Results : నిన్న హిమాచల్.. నేడు కర్ణాటక.. రేపు​ తెలంగాణ

కాంగ్రెస్​లో నయా జోష్.. ఇక ఆ రాష్ట్రాలపై దృష్టి.. నాయకుల మధ్య సయోధ్య కుదిరేనా?

ABOUT THE AUTHOR

...view details