తన ఫోన్‌హ్యాక్ కావడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన ఫోన్ హ్యాక్‌చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు తనను ఆపిల్ సంస్థ జాగ్రత్తగా ఉండమని..హెచ్చరించిందని పేర్కొన్నారు. హ్యాక్‌చేసినంత మాత్రాన తన ఫోన్‌ను ధ్వంసం చేయనని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వాల దోపిడి, చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేస్తామని వెల్లడించారు. మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తామని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వాలు నా ఫోన్ హ్యాక్ చేస్తున్నాయి: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ - ప్రవీణ్‌కుమార్
RS Praveen Kumar phone hacking: ప్రభుత్వాలు తన ఫోన్ హ్యాక్ చేస్తున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. దీనిపై ఆపిల్ సంస్థ హ్యాకింగ్ గురించి తనను హెచ్చరించిందని తెలిపారు. అంత మాత్రాన ఫోన్ ధ్వంసం చేయనని.. దోపిడి, చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
RS Praveen Kumar