ముఖ్యమంత్రి కేసీఆర్... డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen kumar) ట్విట్టర్ వేదికగా అన్నారు. ఒక వైపు ప్రజల గొంతు నొక్కి, ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళితబంధు’ సభ నిర్వహించారని పేర్కొన్నారు.
మరోవైపు ఒక బహుజన బిడ్డ ఓయూ స్కాలర్ పాల్వాయి నగేశ్‌పై పట్టపగలే అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. మీ బంధు-బంధూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.