తెలంగాణ

telangana

ETV Bharat / state

"పోలీస్ నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి" - long jump

RS Praveen Kumar comments on TS Government: పోలీస్ అవ్వాలంటే రాత పరీక్షతో పాటు, ఫిజికల్ టేస్ట్ కూడా పాస్​ అవ్వాలి. దేహదారుఢ్య పరీక్షలో ఒకటి లాంగ్​ జంప్. ఈ పరీక్ష నియమాలకు తగ్గట్టు జరపడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర ఆధ్యక్షులు డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు.

praveen kumar
ప్రవీణ్ కుమార్

By

Published : Dec 19, 2022, 7:22 PM IST

RS Praveen Kumar comments on TS Government: పోలీస్ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్‌ విధించిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. వెంటనే లాంగ్‌ జంప్‌లను నాలుగు మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో చేపట్టిన నియామకాల్లో దేహదారుఢ్య పరీక్షలో లోపాలపై అనేక మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని లక్డీకాపూల్‌లోని బహుజన సమాజ్‌వాది పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికలు వస్తున్నాయని రిక్రూట్‌మెంట్‌ ఇవ్వడం హడావుడిగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచించడంతోనే పలు సమస్యలకు కారణమవుతుందని ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. చాలా కఠినంగా ఉన్న నాలుగు మీటర్ల జంప్‌ ఎంతో శిక్షణ కావాలని, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులకు సరైన సదుపాయాలు లేవన్నారు. అన్ని రకాల పోలీసు నియామకాలకు ఒకే దేహ దారుడ్య పరీక్ష నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థుల సంఖ్య తగ్గించాలంటే రాత పరీక్షలో వడపోయాలన్నారు. అభ్యర్థులు తమ బాధను వ్యక్తం చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టారు. ఇంత వరకు 5 ఈవెంట్స్​కి 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలు. ప్రభుత్వం సరికొత్తగా 3 ఈవెంట్స్ పెట్టి అన్ని క్వాలిఫై అయిన వారికే ఉద్యోగం అంటుంది. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని మా పార్టీ తరుఫున కోరుతున్నాను.-ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, బీఎస్పీరాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details