తెలంగాణ

telangana

ETV Bharat / state

rs praveen kumar: త్వరలోనే ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు..! - తెలంగాణ 2021 వార్తలు

మూడు సభల్లో తన ప్రసంగమప్పుడే విద్యుత్ పోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కావాలనే తన ప్రసంగం అప్పుడు విద్యుత్ తీసేస్తున్నారని తెలిపారు.

rs-praveen-kuamr-speaks-about-power-cutting-on-his-speech-tim
rs praveen kumar: త్వరలోనే ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు..!

By

Published : Aug 4, 2021, 1:58 PM IST

Updated : Aug 4, 2021, 2:50 PM IST

వరుసగా మూడు సభల్లో తాను ప్రసంగం ఇస్తున్నప్పుడే విద్యుత్ నిలిచిపోయిందని.. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే తనతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా పెడుతున్నారని... దాని గురించి అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. తమ శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న రాజప్రసాదాలకు... తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తూ... ట్వీట్ చేశారు.

ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడీ చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి. - ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్


26 ఏళ్లు ఐపీఎస్​ అధికారిగా సేవలు అందించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ (RS Praveen Kumar)​ ఇటీవలె స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఇంకా ఆరేళ్ల సర్వీస్​ ఉన్నప్పటికీ... ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:RS PRAVEEN KUMAR: 'అనవసరంగా హుజూరాబాద్ వ్యవహారంలోకి లాగొద్దు'

Last Updated : Aug 4, 2021, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details