RS.2500 For Women in Telangana Mahalakshmi Scheme 2024 :రాష్ట్రంలో మరో హామీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు, ప్రతినెలా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ నెలాఖరులోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే, 6 గ్యారెంటీలను (Congress Six Guarantees in Telangana)అమలు చేస్తామని ఎన్నికల్లో హస్తం పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే హామీల అమలుకు సంబంధించిన ముసాయిదాపై సంతకం చేశారు.
Mahalakshmi Scheme in Telangana : ఇందులో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరో హామీ అయిన చేయూతలో రూ.10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను అమలు చేసింది. ఇప్పుడుమహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme in Telangana) కిందనే, ప్రతినెలా మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న గ్యారెంటీని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇలాంటి పథకాలపై అధ్యయనం :కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అమల్లో ఉన్న ఇలాంటి పథకాలను అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమవుతుందో నివేదించాలని సూచించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలుండగా, 1.25 కోట్ల మందికి చెల్లిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇచ్చే ప్రాతిపాదికన ఇక్కడ కూడా చెల్లిస్తే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.