తెలంగాణ

telangana

ETV Bharat / state

IPL BETTING: కాయ్​ రాజా కాయ్​.. రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్​ బెట్టింగ్​ - ఐపీఎల్​ బెట్టింగ్​

IPL Betting In Hyderabad: ఐపీఎల్​ సీజన్​ వచ్చిందంటే చాలు భారీ మొత్తంలో బెట్టింగ్​ రాయుళ్లు తమ చేతికి పని చెబుతారు. పోలీసులు వారిపై కొరడా ఝళిపిస్తుంటారు. తాజాగా హైదరాబాద్​ శివారు ప్రాంతంలో బెట్టింగ్ రాయుళ్ల నుంచి పోలీసులు రూ.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు.

BEETING
BEETING

By

Published : Apr 18, 2023, 2:29 PM IST

బెట్టింగ్​ సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న రాజేంద్రనగర్​ డీసీపీ

IPL Betting In Hyderabad: ఐపీఎల్​ అంటే వినోదాన్ని పంచే ధనాధన్​ క్రికెటే కాదు.. అంతకు మించి డబ్బులను సంపాదించే బంగారు బాతు. క్రికెట్ ప్రియులు తమ స్నేహితులు, ఫ్యామిలీస్​తో కలిసి నరాలు తెంచే ఉత్కంఠ భరితమైన మ్యాచ్​లు ఎంజాయ్ చేస్తున్నారు... సాయంత్రం 6 దాటితే చాలు.. ఏ ఇంట్లో చూసినా.. ఐపీఎల్​.. ఐపీఎల్​ అనే వినిపిస్తుంది​. దేశంలో క్రికెట్​ను ఒక మతంలా భావిస్తారు. అయితే కొందరేమో క్రికెట్​ను చూస్తూ ఎంజాయ్ చేస్తోంటే.. మరికొందరేమో వాటిపై పందేలు కాస్తు డబ్బులు కూడబెడుతున్నారు. వేలు.. లక్షలు.. కాదు ఏకంగా కోట్లలో బెట్టింగులకు పాల్పడుతున్నారు.

ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ప్రియులకు ఎంత సంబురమో.. పోలీసులకు అంతకుమించిన పని. అందరూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. పోలీసులు మాత్రం బెట్టింగ్ రాయుళ్ల పని పట్టడంలో బిజీబిజీగా ఉంటారు. బెట్టింగులకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకునే వారిని మంచిమార్గంలో పెట్టే పనిలో నిమగ్నమవుతారు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. అందుకే పోలీసులు భారీ నిఘా పెడుతుంటారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లపై కొరడా ఝుళిపించారు.

ఐపీఎల్​ బెట్టింగ్ కాస్తూ బెట్టింగ్​ బాబులు పోలీసులకు అడ్డంగా చిక్కారు. హైదరాబాద్​ శివారు ప్రాంతంలో క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ ముఠాలోని నలుగురు నిందితుల నుంచి రూ.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిన్న జరిగిన బెంగళూరు, చెన్నై మ్యాచ్​ మీద భారీ మొత్తంలో బెట్టింగ్​ జరిగినట్లు రాజేంద్రనగర్​ డీసీపీ జగదీశ్​ వివరించారు. కొందరు వ్యక్తులు బెట్టింగ్​లకు బానిసై భారీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో.. ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్​లో డబ్బులు పోగొట్టుకున్న వారు.. ఆ అప్పులను తీర్చేందుకు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

"నిన్న చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్​ జరుగుతున్నప్పుడు ఈ బెట్టింగ్​ జరిగింది. ఇప్పటి వరకు రూ.60 లక్షలు రికవరీ అయింది. ఇంకా ఆన్​లైన్​కు సంబంధించి లెక్కలు బయట పడాల్సి ఉంది. 7 ఫోన్లు, ఒక ఐప్యాడ్​ స్వాధీనం చేసుకున్నాం." - జగదీశ్​, రాజేంద్రనగర్​ డీసీపీ

సంగారెడ్డిలో ఐపీఎల్ బెట్టింగ్​: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఓ ఇంటర్​నెట్​ సెంటర్​పై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐపీఎల్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయ నగదు.. ఒక చరవాణి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పటాన్​చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details