తెలంగాణ

telangana

ETV Bharat / state

షాక్​ కొట్టిన విద్యుత్ బిల్లు... 121 రోజులకు రూ.25లక్షలు - తెలంగాణ అధిక కరెంట్ బిల్లు

ఓ వినియోగదారుడికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. 121 రోజులకు రూ.25 లక్షల బిల్లు వచ్చింది. అది చూసి ఖంగుతిన్న వినియోగదారుడు విద్యుత్​ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మీట‌ర్ డిస్​ప్లే స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేద‌ని విద్యుత్ శాఖ అధికారులు సమాధానమిచ్చారు.

current bill
current bill

By

Published : Jul 6, 2020, 7:49 PM IST

Updated : Jul 6, 2020, 8:37 PM IST

విద్యుత్ బిల్లుల్లో భారీ తేడాలు వ‌స్తున్నాయి. అవి చూసిన వినియోగదారులు షాక్​కు గురవుతున్నారు. హైదరాబాద్​ న‌గ‌రంలోని ఓ వినియోగ‌దారుడికి 25 ల‌క్షల క‌రెంట్ బిల్లు రావ‌డంతో షాక్ కొట్టినంత ప‌నైపోయింది. సీతాఫ‌ల్ మండిలోని ఈఆర్​ఓ ప‌రిధిలో ఉన్న లాలాగూడ సెక్టార్​లోని యూఎస్​సీ నంబ‌ర్ 100293954 గ‌ల విద్యుత్ మీట‌ర్​లో 121 రోజులకు 3,45,007 యూనిట్లు క‌రెంట్ బిల్లు వాడిన‌ట్లు రీడింగ్ చూపెడుతోంది. దీంతో రూ.25,11,467ల బిల్లు వ‌చ్చిన‌ట్లు బిల్లు తీసి రీడింగ్ ఆపరేటర్ వినియోగ‌దారుడి చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా వినియోగ‌దారుడు ఖంగుతిన్నాడు.

వెంటనే తేరుకుని ఈ విష‌యం విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ మీట‌ర్​లో లోపం ఉంద‌ని... మీట‌ర్ డిస్​ప్లే స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేద‌ని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. వెంట‌నే మీట‌ర్​ను మార్చి మ‌రో కొత్త మీట‌ర్​ను బిగించిన‌ట్లు వినియోగదారుడు వివరించాడు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

Last Updated : Jul 6, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details