ఆర్ అండ్ బీ శాఖలో రూ.17 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఆ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు. గతంలో ఆర్ అండ్ బీ శాఖలో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల మేర మాత్రమే పనులు జరిగేవని ఆయన తెలిపారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.750 కోట్లు కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్డు సాధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు.
ఆర్ అండ్ బీ శాఖలో రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం: ప్రశాంత్ రెడ్డి - Debate on r and b department
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వేదికగా ఆర్ అండ్ బీ శాఖ గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
రోడ్లపై అసెంబ్లీ చర్చ