తెలంగాణ

telangana

By

Published : Jun 5, 2019, 11:38 PM IST

ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణ కోసం త్రిబుల్​ ఆర్

సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జనసేన పార్టీ నేత లక్ష్మీనారాయణ సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని... ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రీయూజ్‌, రీసైకిల్‌, రీవీవ్‌ అనే త్రిబుల్‌ ఆర్‌ పేరుతో ఆప్​ను విడుదల చేశారు.

పర్యావరణంకై త్రిబుల్​ ఆర్

భవితరాల బంగారు భవిష్యత్‌ కోసం పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ నేత లక్ష్మీనారాయణ అన్నారు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రీయూజ్‌, రీసైకిల్‌, రీవీవ్‌ అనే త్రిబుల్‌ ఆర్‌ పేరుతో రూపొందించిన యాప్‌ను జూబ్లీహిల్స్‌లోని జేడీ ఫౌండేషన్‌ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా యాప్‌ను రూపొందించిన నేచుర్​కేర్‌ ఇన్నోవేషన్‌ సర్వీస్‌ ప్రతినిధులను అభినందించారు. ప్లాస్టిక్‌ వినియోగం అనేక అనార్థలకు కారణమవుతుందని అందుకే తమ ఫౌండేషన్‌ ద్వారా నో ప్లాస్టిక్‌ ఉద్యమం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచే విధంగా వారిలో అవగాహన కల్పించాలని సూచించారు.

పర్యావరణంకై త్రిబుల్​ ఆర్

ABOUT THE AUTHOR

...view details