RPF Constable Rape Attempt: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌పై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఓ యువతి పోటీ పరీక్షల కోసం 2020లో నగరంలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంది. ఆ సమయంలో అమెకు చంద్రశేఖర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత అతనికి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం రాగా.. ఆమెకు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు విధులలో చేరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆమె అస్సాంలో, అతను గుంతకల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. చంద్రశేఖర్ 2021లో విజయవాడకు రాగా.. మాట్లాడుకుందామని చెప్పి యువతిని హోటల్‌కు పిలిచాడు. అక్కడ తనపై చంద్రశేఖర్ అత్యచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల అతని ప్రవర్తన సరిగా లేకపోవటంతో పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. చంద్రశేఖర్ నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అత్యాచారానికి పాల్పడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. కేసు నమోదు - బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
RPF Constable Rape Attempt : ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో వారిద్దరూ ఓ శిక్షణ సంస్థలో కలిశారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ఆ తర్వాత వారిద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. కొన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ హోటల్లో కలిశారు. అయితే అతను వివాహానికి నిరాకరిస్తున్నాడని.. తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపిస్తూ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అతను గుంతకల్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
అత్యాచారానికి పాల్పడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్