రెండు రోజుల క్రితం హైదరాబాద్ బోరబండలో జరిగిన ఘర్షణకు కారకుడైన రౌడీ షీటర్ షరీఫ్‌ను కఠినంగా శిక్షించి.. కేసు నీరుగాస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించారు. ఈ నెల 1న రౌడీ షీటర్ షరీఫ్ తన భర్త శాలీపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధిత మహిళ కమిషన్‌కు వివరించారు.
రౌడీ షీటర్‌ను శిక్షించి.. మమ్మల్ని రక్షించండి: బాధితులు - హెచ్ఆర్సీని ఆశ్రయించిన రౌడీ షీటర్ షరీఫ్ బాధితులు
ఈ నెల 1న రౌడీ షీటర్ షరీఫ్ తన భర్త శాలీపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధిత మహిళ హెచ్ఆర్సీకి వివరించారు. తన భర్త ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఎస్సార్ నగర్ పోలీసులు నామమాత్రంగా కేసుపెట్టి ఒక్క రోజులోనె బెయిల్ ఇచ్చారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భర్త ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఎస్సార్ నగర్ పోలీసులు నామమాత్రంగా కేసుపెట్టి ఒక్క రోజులోనె బెయిల్ ఇచ్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బయటకి వచ్చిన రౌడీ షీటర్ షరీఫ్ తమ కుటుంబ సభ్యులను చంపుతానని సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించి... రౌడీ షీటర్‌కు కొమ్ముకాస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను వేడుకున్నారు.
ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన