రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఐదో రోజు కొనసాగుతోంది. గత ఐదేళ్లుగా ఆర్టీసీలో ఒక్క నియామకం కూడా జరగలేదని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు చేసే సమ్మె ఉద్దేశం జీతభత్యాల గురించి కాదని ఆర్టీసీని బతికించుకోవడమే తమ లక్షమని వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్న ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సమ్మెకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని అశ్వత్థామరెడ్డి కోరారు. సంస్థ కోసం అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని తెలిపారు.
ఆర్టీసీని కాపాడుకోవడమే సమ్మె ఉద్దేశంః అశ్వత్థామరెడ్డి - ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
జీతభత్యాలు ముఖ్య ఉద్దేశం కాదని... ఆర్టీసీని బతికించుకోవటమే సమ్మె లక్ష్యమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఐదో రోజు