లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు రొటేషన్ విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సగం మంది ఉద్యోగులు, సిబ్బంది రొటేషన్ విధానంలో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిప్యూటీ కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులకు ఈ మినహాయింపులు వర్తించబోవు.
Secretariat Employees: సచివాలయ ఉద్యోగులకు రొటేషన్ విధానంలో విధులు - రొటేషన్ విధానంలో విధులు
సచివాలయ ఉద్యోగులు రొటేషన్ విధానంలో విధులకు హాజరుకావాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని అవసరమై పిలిస్తే కార్యాలయాలకు రావాలన్నారు.
సచివాలయ ఉద్యోగులకు రొటేషన్ విధానంలో విధులు
ఉద్యోగులందరూ హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని, అవసరమై పిలిపిస్తే కార్యాలయాలకు రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ
TAGGED:
telangana secretariat news