రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన ఆదాయంతో గుంటూరులోని రెడ్‌క్రాస్ సోసైటీ భాగస్వామ్యంతో ఎనిమిది పడకల ఛారిటబుల్ రోటరీ డయాలసిస్ సెంటర్, అమీర్‌పేట్‌లోని గురుద్వారాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోటీల నిర్వహణ ద్వారా మొత్తం రూ.కోటి సమీకరించాలని యోచిస్తున్నామని అన్నారు
ఆస్పత్రి నిర్మాణం కోసం గోల్ఫ్ టోర్నమెంట్ - Hyderabad District latest News
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ ఛారిటీ నిధుల సేకరణ కోసం వార్షిక గోల్ఫ్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. నగరంలోని గోల్ఫ్ క్లబ్‌లో ఆరో విడత పోటీలను ప్రారంభించారు. వచ్చిన ఆదాయంతో ఏపీలోని గుంటూరులో రెడ్‌క్రాస్ సోసైటీ భాగస్వామ్యంతో ఎనిమిది పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
![ఆస్పత్రి నిర్మాణం కోసం గోల్ఫ్ టోర్నమెంట్ Rotary Club of Hyderabad Deccan Charity hosts annual fundraising golf tournament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10718569-869-10718569-1613916158118.jpg)
ఆస్పత్రి నిర్మాణం కోసం గోల్ఫ్ టోర్నమెంట్
రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్.. తన సేవా కార్యకలాపాల్లో రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్‌ల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా చాలా చురుకుగా పనిచేస్తోంది. ప్రజలకు సురక్షితమైన నీరు, అక్షరాస్యత, విద్య, ఆరోగ్య రంగాలలో అనేక ప్రాజెక్టులను చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రోటరీ గోల్ఫ్ ఫర్ ఛారిటీ టోర్నమెంట్ నిర్వహణకు సహకారం అందించిన సంస్థలకు, వ్యక్తులకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ అధ్యక్షుడు వీవీఎస్ఎన్ రాజు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి:నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్