Roller Skating Girl Rishita Life Story : మానసిక వైకల్యం, అందులోనూ గుండెకు రంధ్రంతో పుట్టిన రుషిత కథ ఇది. బీహెచ్ఈఎల్కు చెందిన రిషితకు ఆరోగ్యపరంగా సమస్యలున్నా ఆమెను తల్లిదండ్రులు మాధవి, ప్రశాంత్ రెడ్డిలు కంటికి రెప్పలా కాపాడుతూ నచ్చిన క్రీడల్లో శిక్షణ ఇప్పించారు. వారి కలలు, ఆశయాలకు అనుగుణంగా రిషిత ఇటీవల జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన ప్రత్యేక ఒలంపిక్స్‌లో సత్తా చాటింది. రోలర్ స్కేటింగ్ స్ట్రైయిట్ లైన్ విభాగంలో రెండు రజత పతకాలు సాధించి దేశఖ్యాతిని ఇనుమడింపజేసింది.
190 దేశాల నుంచి 7 వేల మంది అథ్లెట్లు 26 క్రీడల్లో పాల్గొన్న ఈ ఒలంపిక్స్‌లో 20కిపైగా దేశాల క్రీడాకారులు రోలర్ స్కేటింగ్‌లో పోటీపట్టాడరు. అందులో 30 మీటర్ల లక్ష్యాన్ని 28.71 సెకన్లలో పూర్తి చేసిన రిషిత.. రజత పతకం సాధించి శభాష్ అనిపించుకుంది. రిషిత తండ్రి ప్రశాంత్ ఓ ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా తల్లి మాధవి టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు తొలిసంతానంగా కవలలు పుడతారనుకుంటే గర్భంలోనే మగపిల్లాడు చనిపోయాడు.
- Beach Volleyball India team Captain : నల్గొండ టూ థాయ్‌లాండ్.. బీచ్ వాలీబాల్ కెప్టెన్ ప్రయాణం సాగిందిలా
- కన్నీటి 'పరుగు': అప్పుడు పతకం కోసం.. ఇప్పుడు నీటి కోసం
ఆ ప్రభావం రిషితపై పడి డౌన్ సిండ్రోమ్ సమస్య తలెత్తింది. పుట్టిన 9నెలలకే పాప గుండెలో రంధ్రం ఉన్న సంగతి వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా మారింది. ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ దాతృత్వంతో చికిత్స చేయించి పాపను కాపాడుకున్నారు. స్థానికంగా ఉన్న స్పెషల్ కేర్ స్కూల్లో చదివిస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లి మాధవి రిషితకు బీహెచ్ఈఎల్లోని తెలంగాణ స్పోర్ట్స్ డైరెక్టర్ రెహమాన్ వద్ద రోలర్ స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించింది. రెహమాన్ రిషితలోని ప్రతిభను గుర్తించి ప్రతీ రోజూ బీహెచ్ఈఎల్లోని మైదానంలో శిక్షణ ఇస్తున్నారు.
"నేను చెన్నైలో ప్రాక్టీస్ చేశాను. నాకు మంచిగా స్కేటింగ్ వస్తోంది. స్కేటింగ్‌లో అసలు భయం లేదు. నాకు ట్రైనింగ్ ఇచ్చిన గురువులందరికి కృతజ్ఞతలు. నా విజయం మా నాన్న, అమ్మ, చెల్లికి ఇస్తున్నా. గోల్డ్ మెడల్ సాధిస్తానని నమ్మకం ఉంది".- రిషిత, రోలర్ స్క్రేటింగ్ క్రీడాకారిణి