ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్లోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. కాలనీల్లోని రోడ్లతో పాటు... ప్రధాన రహదారులపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. హైదరగూడలో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడడతంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు.
అస్తవ్యస్తంగా మారిన రోడ్లు.. వాహనదారులకు తప్పని ఇక్కట్లు - రోడ్లపై వర్షాల ప్రభావం
హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లు గుంతలు ఏర్పడి అస్తవ్యస్తంగా మారాయి. వాహనాలు అదుపు తప్పి కిందపడి పోతున్నామని... బండ్లు పాడైపోతున్నాయని ద్విచక్రవాహనదారులు వాపోతున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
అస్తవ్యస్తంగా మారిన రోడ్లు.. వాహనదారులకు తప్పని ఇక్కట్లు
రోడ్లు పాడైపోతున్న కారణంగా వాహనాలు పాడైపోతున్నాయి... అదుపు తప్పి కింద పడిపోతున్నామని... ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మరమ్మతుల్లో భాగంగా గుంతల్లో మట్టిపోయడంతో... అవి బురద మయంగా మారాయి. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ