తెలంగాణ

telangana

ETV Bharat / state

సముద్రాన్ని తలపిస్తున్న భాగ్యనగరం.. రాకపోకలకు ఆటంకం - Heavy rain in Hyderabad

భారీ వర్షంతో భాగ్యనగరం సముద్రాన్ని తలపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

roads are blocked due to heavy rain in Hyderabad
సముద్రాన్ని తలపిస్తున్న భాగ్యనగరం

By

Published : Oct 13, 2020, 11:38 AM IST

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కోఠి, బేగంబజార్, నాంపల్లి, సుల్తాన్ బజార్, బషీర్ బాగ్, ఎంజే మార్కెట్ ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. హిమాయత్ నగర్​లో మోకాళ్ల లోతు వరకు రోడ్డుపై నీళ్లు నిలిచిపోయాయి.

భారీగా నీరు నిలవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్​ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి.. నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details