మహబూబ్నగర్-జడ్చర్ల రోడ్డు విస్తరణ పనులు త్వరితంగా పూర్తిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 167 మహబూబ్నగర్-రాయచూర్ రోడ్డు మధ్య నుంచి వెళ్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలి - రోడ్డు విస్తరణ పనులు త్వరితంగా పూర్తిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
మహబూబ్నగర్-జడ్చర్ల జాతీయ రహదారి పనులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని మంత్రుల అధికారిక నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలి
ఈ రహదారుల పనులు పూర్తైతే పట్టణ రూపు రేఖలు పూర్తిగా మారుతాయన్నారు. అదే విధంగా పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, డివైడర్ పనులు, సెంటర్ లైటింగ్, పట్టణ సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రోడ్లు పూర్తైతే మహబూబ్నగర్ పట్టణం హైదరాబాద్ మాదిరిగా రూపుదిద్దుకుంటుందన్నారు.
ఇదీ చూడండి : అరకొర నైపుణ్యమే!