హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. వాహనాలు, జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరగడం... భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
హెచ్ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు - హెచ్ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి భద్రతా నిబంధనల్ని ఆచరించడమే కాకుండా.. వాహనాలను నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.
హెచ్ఎండీఏ మైదానంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్... కారు ఇతర వాహనాలు నడిపేటప్పుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎస్ సోమేశ్‌కుమార్, సినీనటి ఈషారెబ్బ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా రాష్ట్ర ప్రభుత్వం