తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ కుంగిన రోడ్డు.. మొన్న గోషామహల్​.. నేడు చాదర్​ఘాట్​ - చాదర్​ఘాట్​లో కుంగిపోయిన రోడ్డు

ROAD DAMAGE IN CHADHARGHAT: హైదరాబాద్​ నగరంలో రోడ్లు కుంగిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. మొన్న గోషామహల్​, ఆ తర్వాత హిమాయత్​నగర్​ సంఘటనలు మరువకముందే చాదర్​ఘాట్​లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. రోడ్డు 20 అడుగుల మేర కుంగిపోయింది.

road hole
రోడ్డుపై హోల్​

By

Published : Feb 10, 2023, 4:42 PM IST

ROAD DAMAGE IN CHADHARGHAT: హైదరాబాద్ నగర వాహనదారులకు పెనుముప్పు తప్పింది. చాదర్​ఘాట్​ ప్రధాన రహదారిపై భారీగా గొయ్యి ఏర్పడింది. ఇది గమనించిన అటుగా వెళుతున్న పోలీసులు వెంటనే రక్షణ చర్యలకు పూనుకున్నారు. గొయ్యి చుట్టూ రక్షణ కవచంలా బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. వెంటనే జీహెచ్​ఎంసీ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. రోడ్డు కింద మురుగు కాలువ ఉన్నట్లు జీహెచ్​ఎంసీ సిబ్బంది గుర్తించారు. ఆ డ్రైనేజ్​ లోతు 20 ఫీట్లు ఉంటుందని మున్సిపాలిటీ సిబ్బంది అంచనా వేస్తున్నారు.

చాదర్​ఘాట్​లో రోడ్డుపై ఏర్పడిన 20 అడుగుల గొయ్యి

ABOUT THE AUTHOR

...view details