అందరూ చూస్తుండగానే కుంగిపోయిన రోడ్డు - MEDCHAL DISTRICT NEWS
గత రెండు మూడు రోజులుగా కురుస్తోన్న వర్షానికి... ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. అందరూ చూస్తుండగానే రోడ్డు లోపలికి కుంగిపోయింది. దీనితో పోలీసులు.. చర్యలు చేపట్టారు.

అందరూ చూస్తుండగానే కుంగిపోయిన రోడ్డు
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఏఎస్రావు నగర్లో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, జనం చూస్తుండగానే రోడ్డు కుంగిపోయింది. భారీ గొయ్యి ఏర్పడటం వల్ల అప్రమత్తమైన ట్రాఫిక్ అండ్ కుషాయిగూడ లా అండ్ ఆర్డర్ పోలీసులు... వాహనదారులు ప్రమాదానికి గురికాకుండా చర్యలు చేపట్టారు.