కేపీహెచ్బీ కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు శిరస్త్రాణం ధరించి ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.
బైక్ను ఢీకొట్టిన కారు.. గాల్లో మనిషి - కేపీహెబీలో రోడ్డు ప్రమాదం
ప్రయాణంలో ప్రాణానికి రక్షణగా ఉండేది శిరస్త్రాణమని ఎందరు చెప్పినా తలకెక్కించుకోం... ఏదైనా ప్రమాదం జరిగి శిరస్త్రాణం వల్ల ప్రాణాలతో బయటపడినప్పుడు చూస్తే తెలుస్తుంది.. దాని విలువ మన జీవితమని. కేపీహెచ్బీ కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు హెల్మెట్ ధరించడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కేపీహెబీలో రోడ్డు ప్రమాదం... ఒకరికి గాయాలు
ప్రధాన రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని కాలనీ రోడ్డులోంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు సుమారు 10 మీటర్ల దూరం ఎగిరి పడ్డాడు. ఘటన సమయంలో ద్విచక్ర వాహనదారుడి హెల్మెట్ ధరించి ఉండడం వల్ల ప్రాణాలు దక్కాయి. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల వాహనాలు వేగంగా వస్తున్నాయని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.