హైదరాబాద్ పంజాగుట్ట ప్లై ఓవర్‌పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహమ్మద్ తాజుద్దీన్ అనే వ్యక్తి ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడ్డాడు. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మహమ్మద్ తాజుద్దీన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్‌పై ఉన్న కారు, ద్విచక్రవాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. మృతుడు ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
పంజాగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి - ccident
అర్ధరాత్రి పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నుంచి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.
పంజాగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి వ్యక్తి మృతి