తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీ కారు ఢీ... నలుగురు మృతి - ongole road accident news

కారును లారీ ఢీకొట్దింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి సమీపంలో జరిగింది.

road-accident-in-ongole
లారీ కారు ఢీ... నలుగురు మృతి

By

Published : Dec 12, 2019, 12:15 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని పొదిలి వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు కర్ణాటకలోని బళ్ళారి వాసులుగా గుర్తించారు.


తుపాను వాహనంలో శ్రీశైలం వెళ్లి అక్కడి నుంచి ఒంగోలు మీదుగా తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొత్తపల్లి వద్ద రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ కారు ఢీ... నలుగురు మృతి

ఇవీ చదవండి:తల్లీబిడ్డను సజీవదహనం చేసింది.. కట్టుకున్న వాడే

ABOUT THE AUTHOR

...view details