తెలంగాణ

telangana

ETV Bharat / state

షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు - షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు

సాయి దర్శనం కోసం తెలుగు వారంతా ఓ బస్సులో హైదరాబాద్​ నుంచి బయలుదేరారు. షిర్డీకి చెరువయ్యే సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి.

షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు

By

Published : Aug 3, 2019, 12:56 PM IST

మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది తెలుగువారు గాయాలపాలయ్యారు.

ఏం జరిగిందంటే...

దైవ దర్శనం కోసం తెలుగువారంతా హైదరాబాద్​ నుంచి షిర్డీకి బయలుదేరారు. ఆరెంజ్​ ప్రైవేటు ట్రావెల్స్​లో వెళ్తుండగా... అహ్మద్​నగర్​ రాహురి తాలూకా వద్ద వాహనం పల్టీ కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గురికావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకుని బస్సును అక్కడి నుంచి తొలగించారు.

షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు

ఇదీ చూడండి:'ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్​ పేరు ఖరారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details