అప్పటివరకు స్నేహితులతో సరదాగా గడిపిన వారిని మితిమీరిన వేగం బలిగొంది. శనివారం వారాంతం కావటం వల్ల చంపాపేట్‌కు చెందిన నలుగురు స్నేహితులు గుర్రంగూడ పరిపరాల్లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత తిరిగి చంపాపేట్‌లోని గ్రీన్ పార్క్ కాలనీకి బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న యువకులు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ... కర్మన్‌ఘాట్ పరిపరాల్లో హైవే మీద ఓ చెట్టును ఢీకొన్నారు. కారు అదుపు కాకపోగా... పక్కనే ఉన్న ఓ మెస్ గోడకు తాకింది. మితిమీరిన వేగంతోపాటు.. యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కారు పూర్తిగా దెబ్బతినగా... ఎయిర్ బెలూన్లూ పగిలిపోయాయి.
మద్యం మత్తు... మితిమీరిన వేగం: ముగ్గురు మృతి - కర్మన్‌ఘాట్‌లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో రహదారి రక్తమోడింది. అతివేగం ముగ్గురు యువకులను బలిగొనగా.... సీటు బెల్టు పెట్టుకోవటంతో మరో యువకుడి ప్రాణాలకు ముప్పు తప్పింది. అర్ధరాత్రి వరకు స్నేహితులతో సరదాగా పార్టీ చేసుకున్న ఆ యువకులు మితిమీరిన వేగంతో చెట్టును ఢీ కొట్టారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా... మరో యువకుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటన అర్ధరాత్రి 2 నుంచి 3గంటల మధ్య జరగింది. స్పందించిన స్థానికులు తక్షణం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. వెనకసీట్లో ఉన్న మరో యువకుడు సీటు బెల్టు పెట్టుకోవటం వల్ల ప్రాణాపాయం తప్పి... గాయాలతో బయటపడ్డాడు. చనిపోయిన ముగ్గురు చంపాపేట్‌కు చెందిన సాయినాథ్, వినాయక్, శ్రీరామ్‌గా పోలీసులు గుర్తించారు. మరో యువకుడు సాయిరామ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మితిమీరిన వేగానికి తోడు మద్యం మత్తే యువకుల ప్రాణాలను బలిగొనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.