ROAD ACCIDENT CCTV FOOTAGE: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్‌పై విధులు ముగించుకొని తిరుగు ప్రయాణమైన కానిస్టేబుల్ బైక్‌ను కారు ఢీ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగూళూరు ఔటర్ రోడ్ వద్ద బైక్‌పై వెళుతున్న వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజును వేగంగా వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థి కారు ఢీ కొట్టడంతో, కానిస్టేబుల్‌కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
కానిస్టేబుల్‌పై నుంచి వెళ్లిన కారు సీసీ కెమెరాకి చిక్కిన దృశ్యాలు - తెలంగాణ తాజా వార్తలు
ROAD ACCIDENT CCTV FOOTAGE విధులు ముగించుకొని బైక్‌పై వస్తోన్న ఓ కానిస్టేబుల్‌ను కారు ఢీ కొట్టింది. అతను కారు కింద పడిపోగా కారు అతనిపై నుంచి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో నిక్షిప్తం అయింది. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఈ ఘటన ఇప్పడు వైరల్‌గా మారింది.
![కానిస్టేబుల్‌పై నుంచి వెళ్లిన కారు సీసీ కెమెరాకి చిక్కిన దృశ్యాలు road accident cctv footage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16220632-767-16220632-1661682345998.jpg)
road accident cctv footage
ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని గాయాలతో కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
కానిస్టేబుల్‌పై నుంచి వెళ్లిన కారు సీసీ కెమెరాకి చిక్కిన దృశ్యాలు
ఇవీ చదవండి: