హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న యువకులు డివైడర్ను ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సిద్దిపేట జిల్లా నంగనూర్కు చెందిన గొర్ల సంతోష్, కరీంనగర్ జిల్లా చిగురు మామ్మిడికి చెందిన అచ్చరాజుగా గుర్తించారు.
ఐఐఐటీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి - ROAD ACCIDENT AT IIIT JUNCTION
హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలిలోనే ఇద్దరు మృతి
ద్విచక్ర వాహనంపై నానక్ రాంగూడా నుంచి గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. బైకు నడుపుతున్న అచ్చ రాజు ఎగిరి రొడ్డు పక్కన గల విభాగిని, విద్యుత్ స్తంభం మధ్యలో ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే చనిపోయారు. మృతులిద్దరూ మద్యం మత్తులో బైక్ను అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.